06/11/2026, Friday · 07:15:39 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

కరీంనగర్ కేఫ్సీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Muthyala Praveen Reddy 06/11/2026 12:11 AM కరీంనగర్ 4

కరీంనగర్ కేఫ్సీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!
Want this news as a newspaper clip?Print News Clip
  • పరిశుభ్రత లోపంపై అసంతృప్తి..శాంపిల్స్ ల్యాబ్ కు*

(కరీంనగర్ జిల్లా బ్యూరో మా తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ లోని కేఫ్సీ అవుట్ లెట్ లో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఫుడ్ తయారీ విధానం,నిల్వ సౌకర్యాలు, పరిశుభ్రత పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.అవుట్ లెట్ లో పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ లేదని,అన్ని ఫుడ్ అవుట్ లెట్ లలో తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించామని తెలిపారు.

ల్యాబ్ రిపోర్టులో నిబంధనల ఉల్లంఘన తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కేఫ్సీ యాజమాన్యం మాత్రం అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని తెలిపింది.

ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో దీపావళి పండుగ జరుపుకుంటా

Safety OfficersSurprisechecksFoodKarimnagarCafe

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

63 Posts

Latest News

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో..! ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో దీపావళి పండుగ జరుపుకుంటా అందరికీ ఆర్థిక పథకాలు – ప్రగతికి సరికొత్త అడుగులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎం.ఎస్.ఎఫ్ గ్రామ కమిటీ మండల కమిటీల జిల్లా కమిటీల నిర్మాణం శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మృతి కలకలం వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. బంగారం కోసమే హత్య జరిగిందా? తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై చైన్ స్నాచింగ్ కలకలం ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు