28/10/2026, Wednesday · 12:02:35 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు

Muthyala Praveen Reddy 27/10/2026 10:21 PM కరీంనగర్ 5

అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు
Want this news as a newspaper clip?Print News Clip

-జిల్లా విద్యాధికారి వై.తిరుపతిరావు

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి)అక్టోబర్-27

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఎస్.సిఇ.ఆర్.టి. తెలంగాణ మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోల్  ప్లే పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ రోల్ ప్లే పోటీలను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతిరావు.ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంతో సృజన దాగి ఉంటుందని ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులను గమనిస్తూ వారిలో దాగివున్న అంతర్గత సృజనను వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.విద్యార్థుల్లో బాల్యదశ నుండి వివిధ సామాజిక రుగ్మతల పట్ల స్పృహ కలిగి ఉండాలని కోరారు. అంతేకాకుండా ఆరోగ్యము,మానసిక ఆరోగ్యము, విలువలు,లింగ సమానత, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, శారీరక,మానసిక రక్షణ. సామాజిక మాధ్యమాలయందు జాగ్రత్తగా ఉండడం ఇలాంటి విషయాల మీద అవగాహన కలిగి ఉండాలని ఎస్.సి.ఇ.ఆర్.టి ఈ విషయాల పట్ల పిల్లల్లో అవగాహన కలిగించడానికి ఇలాంటి రోల్ ప్లేస్ ను ఏర్పాటు చేసిందని, వీటిని విద్యార్థుల్లో విరివిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని,విద్యార్థులు ఇలాంటి సామాజిక రుగ్మతల యందు తగు జాగ్రత్తగా మసులుకోవాలని అలాగే విద్యార్థులను ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహిస్తూ సృజనని బయటకు తీయాలని సూచించారు.తదనంతరం ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు కర్ర అశోక్ రెడ్డి, మిల్కురి శ్రీనివాస్,సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి,న్యాయనిర్ణేతలుగా ఖాజా మంజూర్ అలీ,గాజుల రవీందర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన

Students shiningGraduateInteriorCreationRolePlay

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

51 Posts

Latest News

తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు కరీంనగర్ కళాభారతిలో అన్నమయ్య సంకీర్తనల గానామృతం కార్యక్రమం ప్రారంభం ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు.. పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్త - గంజాయి చాక్లెట్ మాయలో పడొద్దు! కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా నిలుపుదాం - డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుదాం లక్ష్మీదేవి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలంటే... అనారోగ్యంతో మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని పరామర్శ ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ