24/10/2026, Saturday · 02:32:36 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

లక్ష్మీదేవి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలంటే...

Muthyala Praveen Reddy 23/10/2026 7:05 PM భక్తి 15

లక్ష్మీదేవి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలంటే...
Want this news as a newspaper clip?Print News Clip

ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి దేవుడి దయ వల్ల బాగా పంట పండి,చాలా డబ్బు వచ్చింది.డబ్బు రాగానే రామయ్య మారిపోయాడు.పొలంలో పనిచేసే వారికి తక్కువ కూలీ ఇచ్చేవాడు. ఇంట్లో అన్నం వృథా చేసేవాడు. భార్యతో "డబ్బు ఉంది కదా,ఏదైనా కొనొచ్చు" అని గర్వంగా మాట్లాడేవాడు.

ఒకరోజు ఒక సాధువు ఆ ఊరికి వచ్చాడు. రామయ్యను చూసి ఇలా అన్నాడు.

"నాయనా,లక్ష్మీదేవి చంచలమైనది. ఒకచోట ఉండదు.ఆమె నీ దగ్గర ఎప్పుడూ ఉండాలంటే 3 పనులు చేయాలి" అన్నాడు.

1. కష్టపడి సంపాదించాలి: చెమటోడ్చి సంపాదించిన డబ్బుకే విలువ ఉంటుంది. అడ్డదారిలో వచ్చిన డబ్బు అడ్డదారిలోనే పోతుంది.

2. వృథా చేయకూడదు: ఆహారాన్ని, డబ్బును,నీటిని వృథా చేయకూడదు. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటే ఉంటుంది.

3. దానం చేయాలి: ఉన్నదాంట్లో కొంత ఇతరులకు పెట్టాలి.పేదవారికి సాయం చేస్తే, లక్ష్మీదేవి సంతోషించి మన దగ్గరే ఉంటుంది.

అప్పటి నుండి రామయ్య మారిపోయాడు. కూలీలకు సరైన జీతం ఇచ్చాడు,అన్నం వృథా చేయడం మానేశాడు,ప్రతి పౌర్ణమికి అన్నదానం చేసేవాడు.లక్ష్మీదేవి దీవెనలు అతనికి ఎల్లప్పుడూ ఉండిపోయాయి.

*నీతి:* డబ్బును గౌరవిస్తే,డబ్బు మనల్ని గౌరవిస్తుంది.

Written By: Muthyala Praveen Reddy

ఇదీ చదవండి :: అనారోగ్యంతో మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని పరామర్శ

Goddess LakshmiLakshmi Deviblessingsalways

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

45 Posts

Latest News

కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా నిలుపుదాం - డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుదాం అనారోగ్యంతో మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని పరామర్శ ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకున్న శ్రీరామోజు శేఖర్‌ దంపతులు శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ!