(కరీంనగర్ జిల్లా బ్యూరో మా తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ లోని కేఫ్సీ అవుట్ లెట్ లో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఫుడ్ తయారీ విధానం,నిల్వ సౌకర్యాలు, పరిశుభ్రత పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.అవుట్ లెట్ లో పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ లేదని,అన్ని ఫుడ్ అవుట్ లెట్ లలో తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించామని తెలిపారు.
ల్యాబ్ రిపోర్టులో నిబంధనల ఉల్లంఘన తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కేఫ్సీ యాజమాన్యం మాత్రం అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని తెలిపింది.