03/11/2026, Tuesday · 10:38:06 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మృతి కలకలం

Muthyala Praveen Reddy 03/11/2026 6:02 AM కరీంనగర్ 5

శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మృతి కలకలం
Want this news as a newspaper clip?Print News Clip
  • న్యాయం చేయాలంటూ సివిల్ హాస్పిటల్ ముందు ఎం.ఎస్.ఎఫ్ నిరసన

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిధి)

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో డి.చంద్రకళ అనే విద్యార్థిని ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతుంది.ఆదివారం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని విద్యార్థిని మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ (ఎం.ఎస్.ఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా (ఎం.ఎస్.ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఇంజం వెంకట్ స్వామి మాదిగ,(ఎంఆర్పీస్) రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగ హాజరై మాట్లాడారు.మృతురాలి కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అమ్మాయి మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని,భవిష్యత్తులో శాతవాహన యూనివర్సిటీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీసీ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్పీస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బొర్రా బిక్షపతి మాదిగ, ఎంఆర్పీస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ,ఎంఆర్పీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఉపేంద్ర మాదిగ,ఎంఆర్పీస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ, ఎం.ఎస్.ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చెంచల నవీన్ మాదిగ,ఎం.ఎం.ఎస్ జిల్లా అధ్యక్షురాలు దండు వరలక్ష్మి మాదిగ, ఎం.ఎస్.పీ జిల్లా కన్వీనర్ బుద్ధుల వాణి, ఎం.ఎస్.ఎఫ్ శాతావాహన యూనివర్సిటీ అధ్యక్షులు చింతల అశోక్ మాదిగ, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీస్ సీనియర్ నాయకులు బోయినీ కొమురయ్య మాదిగ,చిలుముల రాజయ్య మాదిగ,తడగొండ శంకర్ మాదిగ,దండు అంజయ్య మాదిగ,కొత్తూరు రాజన్న మాదిగ, అల్వాల అనిల్ మాదిగ,ఖాతా మల్లన్న మాదిగ,దండు మధు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. బంగారం కోసమే హత్య జరిగిందా?

శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మృతి కలకలం

mruti kalakalamshatavahanavishvavidyalayamlovidyarthini

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

58 Posts

Latest News

వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. బంగారం కోసమే హత్య జరిగిందా? తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై చైన్ స్నాచింగ్ కలకలం ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఎల్ ఎండి కాలనీ నూతన ఎస్.ఐ కి శాలువాతో ఘన సన్మానం అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు కరీంనగర్ కళాభారతిలో అన్నమయ్య సంకీర్తనల గానామృతం కార్యక్రమం ప్రారంభం