తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై చైన్ స్నాచింగ్ కలకలం

(తిమ్మాపూర్ మండలం మా తెలంగాణ ప్రతినిధి)నవంబర్-1
తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి మంగళసూత్రం చోరీ జరిగింది.వివరాల ప్రకారం రామకృష్ణ కాలనీ ఉపజ్ఞహోమ్స్ కు చెందిన చెంచు లక్ష్మి, ఆమె భర్త శ్రీనివాస్ తో కలిసి మహాత్మా నగర్ లోని ప్రముఖ కళాశాలలో చదువుతున్న తమ కొడుకుని చూసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా తిమ్మాపూర్ శివారులోకి రాగానే వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కున్నారు. దీంతో పుస్తెల తాడు తెగిపోయింది. దానికి ఉన్న అర తులం బంగారు పుస్తెలు,గుండ్లను దుండగులు ఎత్తుకెళ్లారు.ఒక పత్రికా కార్యాలయం ఎదుట దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎల్ఎండీ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ అరుణ్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా హైవేపై రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి :: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు












