02/11/2026, Monday · 08:30:53 PM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. బంగారం కోసమే హత్య జరిగిందా?

Muthyala Praveen Reddy 02/11/2026 6:38 PM క్రైమ్ 8

వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. బంగారం కోసమే హత్య జరిగిందా?
Want this news as a newspaper clip?Print News Clip
  • బంగారు ఆభరణాలు మాయం..హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు

(మా తెలంగాణ ప్రతినిధి/తిమ్మాపూర్ మండలం) 

తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన ఉప్పులేటి లచ్చవ్వ (65) తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బంగారం కోసమే గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న తిమ్మాపూర్ సీఐ అనిల్,ఎస్సై అరుణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.క్లూస్ టీమ్ ని పిలిపించి వేలిముద్రలు,ఇతర ఆధారాలను సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంగారం కోసం హత్య జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని సీఐ అనిల్ తెలిపారు. గ్రామంలో ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదీ చదవండి :: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు

woman murderSuspiciousdeathelderlygold

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

57 Posts

Latest News

తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై చైన్ స్నాచింగ్ కలకలం ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఎల్ ఎండి కాలనీ నూతన ఎస్.ఐ కి శాలువాతో ఘన సన్మానం అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు కరీంనగర్ కళాభారతిలో అన్నమయ్య సంకీర్తనల గానామృతం కార్యక్రమం ప్రారంభం ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు..