(మా తెలంగాణ ప్రతినిధి/తిమ్మాపూర్ మండలం)
తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన ఉప్పులేటి లచ్చవ్వ (65) తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బంగారం కోసమే గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న తిమ్మాపూర్ సీఐ అనిల్,ఎస్సై అరుణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.క్లూస్ టీమ్ ని పిలిపించి వేలిముద్రలు,ఇతర ఆధారాలను సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంగారం కోసం హత్య జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని సీఐ అనిల్ తెలిపారు. గ్రామంలో ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.