06/11/2026, Friday · 07:15:00 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో..!

Muthyala Praveen Reddy 06/11/2026 1:17 AM క్రీడలు 3

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో..!
Want this news as a newspaper clip?Print News Clip
  • 23 ఏళ్ల సంచలన ప్రయాణానికి ముగింపు.. నెంబర్ 7 జెర్సీకి వీడ్కోలు.

(స్పోర్ట్స్ డెస్క్ మా తెలంగాణ): పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.గురువారం తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియో ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు."పోర్చుగల్ ప్రజలారా, మన జాతీయ జట్టు నెంబర్ 7 జెర్సీని తిరిగి అప్పగించే రోజు వచ్చేసింది" అంటూ అభిమానులకు లేఖ చదివి వినిపించాడు.2003 ఆగస్టులో 18 ఏళ్ల వయసులో కజకిస్తాన్ పై అరంగేట్రం చేసిన రొనాల్డో,23 ఏళ్ల పాటు పోర్చుగల్ జట్టుకు సేవలందించాడు.

*రికార్డుల మోత:*

*- మ్యాచ్ లు: 234 (ప్రపంచ రికార్డు)*

*- గోల్స్: 146 (ప్రపంచ రికార్డు)*

*- యూరో 2016 ఛాంపియన్*

*- నేషన్స్ లీగ్ 2019, 2025 ఛాంపియన్*

ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ "ఇది సులభమైన నిర్ణయం కాదు.కొన్ని నిర్ణయాలు మనసుతోనే కాదు,హృదయంతో కూడా తీసుకోవాలి.పోర్చుగల్ ఎప్పుడూ నాలో భాగమే" అని అన్నాడు.తన కుటుంబానికి, పోర్చుగల్ ప్రజలకు,తోటి ఆటగాళ్లకు,కోచ్ లకు కృతజ్ఞతలు తెలిపాడు.కాగా,గత నెలలో కోచ్ జార్జ్ జీసస్ తో విభేదాల కారణంగా టీమ్ క్యాంప్ నుండి వెళ్లిపోయిన రొనాల్డో,చివరి మ్యాచ్ సెప్టెంబర్ 24న వేల్స్ పై 1-0 తో గెలిచిన మ్యాచ్ లో ఆడాడు.

*పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్*

ఈ సందర్భంగా"రొనాల్డోకు లోతైన కృతజ్ఞతలు,అపారమైన గౌరవం.ఆయనకు తగిన సన్మానం లేకుండా ఈ వీడ్కోలు జరగదు" అని ప్రకటించింది.

రొనాల్డో పూర్తిగా ఫుట్‌బాల్ కు రిటైర్ కాలేదు.సౌదీ క్లబ్ అల్-నాసర్ తరపున ఆడుతూనే ఉంటాడు.ప్రస్తుతం 985 గోల్స్ తో 1000 గోల్స్ మైలురాయికి దగ్గరగా ఉన్నాడు.

ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో దీపావళి పండుగ జరుపుకుంటా

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో..!
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో..!

announces retirementCristianoRonaldointernationalfootball

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

63 Posts

Latest News

కరీంనగర్ కేఫ్సీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు! ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో దీపావళి పండుగ జరుపుకుంటా అందరికీ ఆర్థిక పథకాలు – ప్రగతికి సరికొత్త అడుగులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎం.ఎస్.ఎఫ్ గ్రామ కమిటీ మండల కమిటీల జిల్లా కమిటీల నిర్మాణం శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మృతి కలకలం వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. బంగారం కోసమే హత్య జరిగిందా? తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై చైన్ స్నాచింగ్ కలకలం ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు