(తిమ్మాపూర్ మండలం/మా తెలంగాణ ప్రతినిధి)
తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలో దసరా పండుగను పురస్కరించుకుని శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా సిబ్బందికి కమిటీ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు.గ్రామ పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని గౌరవించుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు,భవాని స్వాములు, గ్రామపంచాయతీ,సిబ్బంది పాల్గొన్నారు.