Maa Telangana News
Date of Publish : 05/11/2026, 6:38 pm
Published by Muthyala Praveen Reddy

ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో దీపావళి పండుగ జరుపుకుంటా

  • పేదల సొంతింటి సంతోషంలో పాలుపంచుకుంటా
  • సీఎం రేవంత్ రెడ్డి

(హైదరాబాద్ మా తెలంగాణ):

దీపావళి వేళ ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో పండుగ జరుపుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో పాలుపంచుకుంటానని ఆయన అన్నారు.పేదలకు సొంతిల్లు అనేది కేవలం ఒక ఇల్లు కాదని,అది వారి ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు భరోసా అని సీఎం పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నాయని తెలిపారు.దీపావళి అంటేనే వెలుగుల పండుగ అని,ఆ వెలుగులు పేదల ఇళ్లలో వెలగాలని,వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనే తాను వారి ఇంటికి వెళ్తున్నానని సీఎం అన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో పండుగ చేసుకోవాలని ఆదేశించారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు,స్థానిక నాయకులు తమ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలిసి,వారితో కలిసి దీపావళి జరుపుకోవాలని సూచించారు.అధికారులు కూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు."నా పండుగ పేదల ఇంట్లోనే. వారి సంతోషమే నా సంతోషం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save