Maa Telangana News
Date of Publish : 04/11/2026, 11:08 pm
Published by Muthyala Praveen Reddy

అందరికీ ఆర్థిక పథకాలు – ప్రగతికి సరికొత్త అడుగులు

  • ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు
  • బీమా, పెన్షన్ పథకాలు సద్వినియోగం చేసుకోండి
  • ఆర్బీఐ ఏజీఎం చిరంజీవి

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిధి):

కరీంనగర్ రూరల్ నగునూరు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో దుబ్బపల్లి గ్రామంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ సాచ్యురేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బీఐ ఏజీఎం చిరంజీవి మాట్లాడుతూ,అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు,ప్రభుత్వ ఆర్థిక పథకాల ప్రయోజనాలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని,కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజెజెబీవై) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై),అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)వంటి పథకాలలో అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సూచించారు.యుబీఐ ఏజీఎం కృష్ణమాచార్యులు మాట్లాడుతూ,గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు,పొదుపు, బీమా,పెన్షన్ పథకాలపై అవగాహన కల్పించడం ద్వారా ఆర్థిక భద్రత, స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు.డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని,ఆన్‌లైన్ ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో (యుబీఐ) నగునూరు బ్రాంచ్ మేనేజర్ సృజన్,

(సీఎఫ్ ల్)కౌన్సిలర్లు తొర్తి శ్రీనివాస్,క్రాంతి కుమార్,బీసీ దూడం శ్రీనివాస్,గ్రామ సర్పంచ్ మోతే ప్రశాంత్ రెడ్డి,ఉపసర్పంచ్ అలువాల శ్రీకాంత్,పంచాయతీ కార్యదర్శి సుజాత, స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save