Maa Telangana News
Date of Publish : 31/10/2026, 12:53 am
Published by Muthyala Praveen Reddy

హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్

-త్రుటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ అక్టోబర్-31(మాతెలంగాణ): 

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.ఈ క్రమంలో మాదాపూర్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.విఠల్‌రావు నగర్ సమీపంలో జెప్టో (జెప్టో) సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఘంటసాల అర్జున్ కుమార్ (46) తన బైక్‌పై వెళ్తుండగా వరద నీటి ఉధృతికి అదుపుతప్పి పక్కనే ఉన్న నాలాలో పడిపోయారు.విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్,జీహెచ్ఎంసీ డీఆర్ఫ్ బృందాలు  సహాయక చర్యలు చేపట్టి అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు.ప్రస్తుతం అర్జున్ కుమార్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.అయితే నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అతని బైక్‌ను మాత్రం బయటకు తీయలేకపోయారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save