Maa Telangana News
Date of Publish : 29/10/2026, 5:00 am
Published by Muthyala Praveen Reddy

ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు

  • ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
  • చీఫ్ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ పత్రిక ప్రతినిధి)

జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్.ఎచ్ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా నిరవధిక సమ్మెకు హాజరైన చీఫ్ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చీఫ్ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం డిమాండ్ చేశారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది.గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, గర్భిణులు,చిన్నపిల్లలు,వృద్ధులు,పేద మరియు బలహీన వర్గాలకు వైద్య సేవలు అందించడంలో వీరు నిరంతరం కృషి చేస్తున్నారు.అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, పరిమిత వనరులతో విధులు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.అయితే,ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న ఎన్.ఎచ్ఎం ఉద్యోగులు ఉద్యోగ భద్రత,వేతనాలు, పదోన్నతులు,బదిలీలు,ఆరోగ్య సదుపాయాలు,ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సంవత్సరాల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలి.  ఎన్.ఎచ్ఎం ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లలో భాగంగా ఉద్యోగ భద్రత కల్పించడం,సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం,బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించడం,వేతనాల పెంపు,బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం,ఇచ్ఎస్/ఈస్ఐ వైద్య సదుపాయాలు కల్పించడం,పెండింగ్ బకాయిలు చెల్లించడం,పీఆర్సీ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు అమలు చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని బీఎస్పీ కోరుతోంది.అదేవిధంగా,ఉద్యోగులకు వర్తించే నిబంధనల ప్రకారం వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని,విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని,దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత,గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించడం అత్యంత అవసరం. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం పట్ల ప్రభుత్వం స్పందించాలి.వారి డిమాండ్లను కేవలం ఉద్యోగుల సమస్యలుగా కాకుండా, ప్రజారోగ్య వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా పరిగణించాలి అని అన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ ఎన్.ఎచ్ఎం

ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలం పరిష్కారం కాకుండా ఉంటే,ఉద్యోగులపై పని ఒత్తిడి పెరగడంతో పాటు ప్రజలకు అందించే ఆరోగ్య సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.అందువల్ల ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని బీఎస్పీ కోరుతోంది.ఉద్యోగుల పోరాటానికి బీఎస్పీ సంపూర్ణ సంఘీభావం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ సమాజంలోని అణగారిన వర్గాలు,కార్మికులు,ఉద్యోగులు మరియు సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని బీఎస్పీ కరీంనగర్ జిల్లా శాఖ పేర్కొంటోంది.ఎన్.ఎచ్ఎం ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి,సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకొని,ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకు బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని, ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి సమస్యల పరిష్కారానికి తమ సంఘీభావాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్,బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్,పార్లమెంట్ ఇంచార్జ్ లు అక్కి బాలకిషన్,దొడ్డే సమ్మయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాలి తిరుపతి,అసెంబ్లీ ఇంచార్జ్ లు అంబాల ప్రభాకర్,మాతంగి మల్లయ్య,అసెంబ్లీ అధ్యక్షులు ఉల్లెందుల మహేష్,కుమ్మరి సంపత్,గిన్నారపు మహేందర్,సీనియర్ నాయకులు మారేపల్లి మొగిలయ్య,అసెంబ్లీ కమిటీల నాయకులు నిశాని సురేష్,ఆరెల్లి రాజు,ములుగూరి నివాస్,బీవీఎఫ్ ప్రభాకర్, శివ,తదితరులు పాల్గొన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save