(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్/మా తెలంగాణ పత్రిక ప్రతినిధి)అక్టోబర్-28
తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండి కాలనీ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన(ఎస్.ఐ) అరుణ్ ను సామాజిక తెలంగాణ పత్రిక జర్నలిస్ట్ ప్రవీణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్.ఐ అరుణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎల్.ఎం.డి కాలనీ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని ఎస్.ఐ అరుణ్ తెలిపారు.ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పిస్తామని,గంజాయి,డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు.పోలీస్ - ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడేలా కృషి చేస్తానని అన్నారు.